ఇంటర్ అర్హతతో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు | Latest CISF Notification 2024

ఇంటర్ పాస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి 1130 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి జాబ్స్ నీ సెపరేట్ చేసి ఇచ్చారు. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 21,700 నుండి 69,100 వరకు జీతం ఇస్తారు.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) లో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1130 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో ఇతర రాష్ట్రాల వారికి సెపరేట్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు సైన్స్ విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి సొంత రాష్ట్రంలోనే పరీక్ష ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, ఫిజికల్ స్టాండర్డ్స్ క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) లో ఫైర్ మ్యాన్ విభాగంలో మొత్తం 1130 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ నీ రాష్ట్రాల వారీగా సెపరేట్ చేసి క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని Apply చేసుకోవచ్చు.

విద్య అర్హతలు :

కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ లో మీరు చదివిన గ్రూప్ లో సైన్స్ అనేది ఒక సబ్జెట్ అయి ఉండాలి.

More Jobs :

🔥 ఇంటర్ తో రైల్వే లో 10,844 క్లర్క్, TC ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో తెలంగాణ RTC ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో 500 Work From Home Jobs

వయస్సు :

30/09/2024 నాటికి కనీసం 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే మీరు 01/10/2001 నుండి 30/09/2006 మధ్య పుట్టి ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC/ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ & ఫీజు :

Apply చేసుకునే వారు అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మన డిటైల్స్ తో ఎలాంటి తప్పలు లేకుండా ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక మన సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలను నెట్ బ్యాంకింగ్, UPI, క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలి. ( లేదా ) SBI బ్యాంక్ లో చల్లన్ ద్వారా కూడా చెల్లించవచ్చు. SC/ ST / ఎక్స్ సర్వీస్ మెన్ వారు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

పరీక్ష విధానం & సిలబస్ :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ( CBT ) నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ లో ఉంటాయి. ఈ పరీక్షకు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ సంబంధిన టాపిక్స్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి టాపిక్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటుంది. పరీక్షకు మొత్తం 2 గంటల సమయం ఇస్తారు.

ఫిజికల్ స్టాండర్డ్స్ :

👉🏻 5 కిలో మీటర్ల దూరం నీ 24 నిమిషాలలో పూర్తి చేయాలి.
👉🏻 మినిమం హైట్ 170 సెంటి మీటర్లు ఉండాలి.
👉🏻 చెస్ట్ మినిమం 80 సెంటి మీటర్లు ఉండాలి. ఎక్స్ ప్యాన్డ్ చేసినప్పుడు మినిమం 5 సెంటి మీటర్లు పెరగాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ పెడతారు. క్వాలిఫై అయినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి 21,700 నుండి 69,100 వరకు బేసిక్ పే తో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అల్లోవెన్స్ కూడా వర్తిస్తాయి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 30/09/2024

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top