ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 13 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 7th / 10th / డిగ్రీ పూర్తి చేసి అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 33,100 వరకు జీతం ఇస్తారు. ఇందులో ఉన్న ఉద్యోగాలు, అర్హతలు, వయస్సు, జీతం అన్ని వివరాలు క్రింద ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 13 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- సూపెరిడెంట్ – 01
- ఎడ్యుకేటర్- 03
- కుక్ – 03
- హెల్పర్ కమ్ నైట్ వాచ్ మెన్ – 02
- ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ – 03
- పి టి ఇంస్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ – 01
విద్య అర్హతలు :
కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్ మెన్ జాబ్స్ కి Apply చేసుకునే వారు 7వ తరగతి పాస్ అయి ఉండాలి, 10వ తరగతి పాస్ / ఫెయిల్ అయిన Apply చేసుకోవచ్చు. ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఎడ్యుకేటర్, పి టి ఇంస్ట్రక్టర్ జాబ్స్ కి Apply చేసుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సూపెరిడెంట్ జాబ్స్ Apply చేసుకునే వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
More Jobs :
🔥 Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా Wipro జాబ్స్ ఇస్తుంది
🔥 AP MRO ఆఫీస్ లో 670 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ అర్హత తో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు
🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వయస్సు :
01/07/2024 నాటికి మినిమం 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న వారు Apply చేసుకోవచ్చు. ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించవు.
Apply ప్రాసెస్ :
1st అఫిషియల్ వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫారం నీ ఎలాంటి తప్పులు లేకుండా నింపాలి. అప్లికేషన్ ఫారం కి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ జీరాక్స్ కాపిస్ నీ జత చేసి డైరెక్ట్ గా వెళ్లి ది డిస్ట్రిక్ట్ ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీస్, నియర్ తలసింగి, బిసైడ్ బాలసదన్, పాడేరు, A.S.R. జిల్లా – 531024. ఈ అడ్రస్ లో అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ & జీతం :
Apply చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి మినిమం 5,000 నుండి 33,100 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
04/09/2024 వ తేది నుండి 13/09/2024 వ తేది సాయత్రం 5 గంటల లోపు Apply చేసుకోవాలి.