పోలీస్ జాబ్స్ సంపాదించాలని సంవత్సరాల నుండి ఎదురుచూసే వారికి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ నీ Male & Female కి సపరేట్ గా ఇచ్చారు అందరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి అర్హతలు, వయస్సు, జీతం అన్ని వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ విభాగంలో 119 ఉద్యోగాలు హెడ్ కానిస్టేబుల్ విభాగంలో 9 ఉద్యోగాలు మొత్తం 128 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th, హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్థారు. క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి 25,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ పోలీస్ ఉద్యోగాలను ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ మరియు హార్ కానిస్టేబుల్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 119 ( Male – 101, Female – 18 ) ఉద్యోగాలు, హెడ్ కానిస్టేబుల్ విభాగంలో 9 ( Male – 08, Female – 01 ) ఉద్యోగాలు, మొత్తం 128 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
కానిస్టేబుల్ – కేవలం 10వ తరగతి పూర్తి చేసిన అందరూ Apply చేసుకోవచ్చు.
హెడ్ కానిస్టేబుల్ – ఇంటర్ / డిప్లొమా పూర్తి చేసిన వారు Apply చేసుకోవచ్చు.
More Jobs :
🔥 TGSRTC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Work From Home Jobs
🔥 AP జిల్లా కోర్టు లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో ప్రభుత్వ స్కూల్ లో వార్డెన్ ఉద్యోగాలు
వయస్సు :
కానిస్టేబుల్ – 10/09/2024 నాటికి మినిమం 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లై చేసుకునే వారు 11/09/1999 నుండి 10/09/2006 సంవత్సరాల మధ్య పుట్టు ఉండాలి.
హెడ్ కానిస్టేబుల్ – 10/09/2024 నాటికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 11/09/1997 నుండి 10/09/2006 సంవత్సరాల మధ్య పుట్టి ఉండాలి.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC/ ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తుంది.
ఫిజికల్ స్టాండర్డ్స్ :
ఎత్తు – పురుష అభ్యర్థులు మినిమం 170 సెంటి మీటర్లు ఎత్తు ఉండాలి, మహిళా అభ్యర్థులు మినిమం 157 సెంటీ మీటర్లు ఎత్తు ఉండాలి.
చెస్ట్ – చెస్ట్ కొలతలు కేవలం పురుష అభ్యర్థుల నుండి తీసుకుంటారు. మినిమం 80 సెంటి మీటర్లు ఎక్స్ ప్యాండ్ చేసినప్పుడు 5 సెంటి మీటర్లు పెరగాలి.
రన్నింగ్ – పురుష అభ్యర్థులు 1.6 కిలో మీటర్స్ లో 7 నిమిషాల 30 సెకండ్స్ లో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులు 800 మీటర్స్ నీ 4 నిమిషాల 45 సెకండ్స్ లో పూర్తి చేయాలి.
Apply ప్రాసెస్ & ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థుల కేవలం Online లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో మీ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలానే జనరల్ కేటగిరి వారు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో కూడా క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు అలానే మెడికల్ చెక్ చేస్తారు. ఫైనల్ గా పోలీస్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
కానిస్టేబుల్ జాబ్ కి బేసిక్ పే 21,700 – 69,100 వరకు ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కి 25,500 – 81,000 ఉంటుంది. బేసిక్ పే తో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అల్లోవెన్స్ కూడా ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 29/09/2024